చనిపోయిన విజయ్‌ను మరింతగా చంపేస్తోంది

Vanitha Reddy says My husband Vijay Sai had HIV

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సినీ నటుడు విజయ్‌ నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. తన రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న విజయ్‌ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ఆయన తీసుకున్న రెండు సెల్ఫీ వీడియోలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వీడియోల ఆధారంగా కేసును బుక్‌ చేసుకున్న పోలీసులు ఆయన భార్య వనిత రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వనిత రెడ్డి కారణంగా విజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా ఆ వీడియోను చూస్తుంటే అర్థం అవుతుంది. తన కూతురు వనిత వద్ద పెరగవద్దని విజయ్‌ కోరుకుంటున్నాడు. వనిత మరియు ఆమె తల్లి వ్యభిచార వృత్తి చేస్తున్నారు అంటూ విజయ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. దాంతో విజయ్‌పై కూడా వనిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చనిపోయాడు అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తోంది.

తాజాగా వనిత రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజయ్‌ మరణంకు ఆయన తండ్రి పూర్తి కారణం అంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్‌ గత కొంత కాలంగా ఆర్ధికంగా చితికి పోయాడని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, ఆయన అనారోగ్యంతో కూడా బాధ పడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. విజయ్‌కు ఎయిడ్స్‌ ఉన్నట్లుగా కూడా వనిత పేర్కొంది. చనిపోయిన విజయ్‌పై ఇలాంటి అబాండాలు వేయడంతో ఆయన కుటుంబ సబ్యులు మరింతగా క్రుంగి పోతున్నారు. వనిత రెడ్డి తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పుకునేందుకు చనిపోయిన విజయ్‌ను మళ్లీ మళ్లీ చంపేస్తోంది అంటూ విజయ్‌ తరపు వారు అంటున్నారు.