శ్రీరెడ్డి ముందు సామాన్యుల ప్రశ్నలు

Common People Reaction To Sri Reddy

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మాయిలను అంగడి బొమ్మలుగా వాడుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంది. సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన వారిని కొందరు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కొందరు సామాన్యు కూడా విమర్శలు చేస్తున్నారు. శ్రీరెడ్డికి అన్యాయం జరిగితే పోరాటం చేసే విధానం ఇది కాదని, ప్రస్తుతం శ్రీరెడ్డి చేస్తున్నది పబ్లిసిటీ కోసం అనిపిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరెడ్డి చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరి ఇంత కాలం ఎందుకు ఆమె మీడియా ముందుకు కాని, పోలీసుల వద్దకు కాని వెళ్లలేదు. ఇన్నాళ్లు వారితో ఎంజాయ్‌ చేసి, ఇప్పుడు మొత్తుకుంటుంది. అభిరామ్‌ గురించి ఇండస్ట్రీలో చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. అతడి పద్దతి బాగుండదని మొదటి నుండి కూడా అంతా అంటూ ఉంటారు. అలాంటప్పుడు అతడితో నువ్వు స్నేహం ఎందుకు చేయాల్సి వచ్చింది, అతడితో ఎలా ప్రేమలో పడ్డావు, అతడిని ఎలా నమ్మావు. అతడి నుండి నువ్వు ఏదో ఆశించి అతడికి క్లోజ్‌గా ఉన్నావు. ఇప్పుడు అతడితో దూరం అయ్యాక ఫొటోు విడుదల చేశావు. నీకు పబ్లిసిటీపై ఉన్నంత శ్రద్ద, న్యాయం కోసం పోరాడాలి అని లేదు. అభిరామ్‌ వల్ల నీకు అన్యాయం జరిగితే వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలి కాని స్టూడియోలు పట్టుకుని ఎందుకు తీరుగుతున్నావు? ఇలా సోషల్‌ మీడియాలో సామాన్యులు శ్రీరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.