కోన వెంకట్‌పై శ్రీరెడ్డి అత్యాచార ఆరోపణలు

Sri Reddy shocking comments on kona venkat

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి సంచలన లీక్స్‌ కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ గురించిన విషయాలు చర్చకు వచ్చాయి. తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత అయిన కోన వెంకట్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక ఛానెల్‌లో మాట్లాడుతూ శ్రీరెడ్డి ఆయనపై అత్యాచార ఆరోపణలు చేసింది. జూబ్లీహిల్స్‌ స్మశాన వాటిక వద్ద ఉన్న గెస్ట్‌ హౌస్‌కు ఒకసారి నన్ను రమ్మంటే వెళ్లాను అని, అక్కడ కోన వెంకట్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆ సమయంలో నన్ను మందు తాగుతావా అంటూ ప్రశ్నించారు. అందుకు తాను అలవాటు లేదు అంటూ చెప్పడంతో అలవాటు చేసుకోవాలంటూ కోన వెంకట్‌ అన్నాడు అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో ఆయన తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడని, ఆయన తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు అని చెప్పేందుకు ఛాట్‌ షాట్స్‌ ఉన్నాయని పేర్కొంది. పోలీసులు విచారణ చేస్తే తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతాను అంటూ చెప్పుకొచ్చింది. చాట్‌లతో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఆసక్తి చూపించాలని శ్రీరెడ్డి కోరింది. కోన వెంకట్‌పై త్వరలోనే లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై కోన వెంకట్‌ స్పందిస్తూ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసినా సిద్దం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

sri reddy about konavenkat