Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జక్కన్న మల్టీస్టారర్ చిత్రానికి మెల్ల మెల్లగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించనున్న ఈ చిత్రంలో విలన్ మరియు హీరోయిన్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం అందుతుంది. ఇక రాజమౌళి దర్శకుడిగా కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా తన తండ్రి ఇచ్చిన కథలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. తెలుగుతో పాటు హిందీలో ఇంకా పలు భాషల్లో అద్బుతమైన కథలు అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈసారి తన కొడుకు మల్టీస్టారర్ చిత్రానికి కథను అందించలేదు అంటూ సమాచారం అందుతుంది.
‘బాహుబలి’ చిత్రం తర్వాత అంతటి చిత్రాన్ని చేయాలని ఎదురు చూస్తున్న రాజమౌళి వద్దకు దర్శకుడు గుణ్ణం గంగరాజు ఒక కథతో రావడం, ఆ స్టోరీ లైన్ జక్కన్న మనసుకు హత్తుకోవడంతో వెంటనే ఆ స్టోరీతోనే తన తదుపరి చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్టోరీ లైన్‌ను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డెవలప్ చేయించి, స్క్రిప్ట్‌ను రెడీ చేయిస్తున్నాడు. స్టోరీ లైన్‌ను ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లకు చెప్పడం జరిగింది. స్టోరీ లైన్ నచ్చడంతో వారిద్దరు కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి సారి తన తండ్రి కథతో కాకుండా మరో రచయిత ఇచ్చిన కథను రాజమౌళి డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.