ఈ చిత్రం రైట్స్‌ కోసం పోటీలు పడుతున్న బయ్యర్లు

ఈ చిత్రం రైట్స్‌ కోసం పోటీలు పడుతున్న బయ్యర్లు

అల వైకుంఠపురములో చిత్రం ఘన విజయాన్ని అందుకోవడంతో, హారిక హాసిని సంస్థకే చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి వస్తోన్న భీష్మకి ట్రేడ్‌లో విపరీతమయిన గిరాకీ ఏర్పడింది. నితిన్‌ గత మూడు చిత్రాలు ఫ్లాప్‌ అయినా కానీ ఈ చిత్రం టీజర్‌ ఎంటర్‌టైనింగ్‌గా వుండడం, ఇంతవరకు విడుదల చేసిన రెండు పాటలు క్లిక్‌ అవడంతో బయ్యర్లు ఈ చిత్రం రైట్స్‌ కోసం పోటీలు పడుతున్నారు.

ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రష్మిక హీరోయిన్‌ అవడం మరో ప్లస్‌ పాయింటు. ఇటీవలే సరిలేరు నీకెవ్వరుతో విజయం సాధించిన రష్మిక ఇందులో మాస్‌ డాన్స్‌లు చేసింది. నితిన్‌, రష్మిక జంట ఫ్రెష్‌గా వుండడం, సినిమా కూడా ఫక్తు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనిపించడంతో ఫిబ్రవరిలాంటి వీక్‌ సీజన్‌లో వస్తున్నా కానీ భీష్మకి డిమాండ్‌ తీవ్రంగా వుంది.

మూడు ఫ్లాపుల ఎఫెక్టుకి గత ఏడాదిలో అసలు రిలీజే లేని నితిన్‌ ఈ చిత్రంతో మళ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చేస్తాననుకుంటున్నాడు. ఈ చిత్రం తర్వాత వచ్చే రంగ్‌ దే కూడా ఇదే బ్యానర్‌లో చేస్తోన్న నితిన్‌ ఈ ఏడాదిలో మొత్తం మూడు సినిమాలు సిద్ధం చేస్తున్నాడు.