కలెక్టర్ కాదట దేవత

controversy-on-amrapali-statue-holds-ganapati-idol-in-warangal

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దీన్ని గౌరవం అనాలో, పైత్యం అనాలో. పిచ్చి అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకని ఆ ఫ్యాన్ బేస్ ఆధారంగా ఆమె ఒళ్లో వినాయకుడ్ని పెట్టి విగ్రహం తయారు చేయడం చర్చనీయాంశమైంది. ఎంత సిన్సియర్ కలెక్టర్ అయితే మాత్రం పార్వతీదేవి అయిపోతుందా అని సెటైర్లు పడుతున్నాయి.

ఇంతవరకూ ఏ రాజకీయ నేత కూడా నోచుకోని అదృష్టానికి కలెక్టర్ నోచుకున్నారని ఆమె అభిమానులు సంబరపడుతుంటే.. హిందూ మతాభిమానులు మాత్రం రగిలిపోతున్నారు. అసలు వినాయకుడ్నే ఎలా పడితే అలా తయారుచేస్తున్నారని, ఇప్పుడు ఏకంగా కలెక్టర్ ను గణేషుడి తల్లిని చేయడం కంటే పాపం మరొకటి లేదని వారి అభిప్రాయంగా ఉంది.

డైనమిక్ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి వర్గాలకు అతీతంగా జనంలో అభిమానం ఉంది. తమ కలెక్టర్ ను ఎప్పటికీ మార్చొద్దని కూడా జిల్లా ప్రజలు కేసీఆర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అలాంటి పరిస్థితిలో ఆమ్రపాలి దేవతవడం కొందరికి నచ్చలేదు. దీంతో సైలంటుగా ఆమె విగ్రహానికి నల్లరంగు పూశారు. పైగా జనం కూడా విగ్రహం చూస్తున్నారు కానీ.. ఎవరూ కొనడం లేదట. అంటే వాళ్లు కూడా ఆ విగ్రహ తయారీని మెచ్చలేదనే అర్థం.

మరిన్ని వార్తలు:

ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులైనట్లే

రేపిస్ట్ బాబాకు మన దగ్గరా ఆస్తులు