జైలర్ డైరెక్టర్‌కి గిఫ్ట్ గా కాస్ట్లీ కారు..!

జైలర్ డైరెక్టర్‌కి గిఫ్ట్ గా కాస్ట్లీ కారు..!
Latest News

జైలర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ ఖుష్ అయిపోయారు. మూవీ మేకర్స్ సన్ పిక్చర్స్ రజనీకి ఇటీవల బ్రాండ్ న్యూ బిఎండబ్ల్యూ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. నిర్మాత కళానిధి మారన్ జైలర్ డైరెక్టర్ కి కూడా ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చారు దర్శకుడు నెల్సన్ కి కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ కింద ఇచ్చారంట నిర్మాత కళానిధి మారన్. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. నెల్సన్ కి నిర్మాతలు నుండి భారీ చెక్ కూడా వచ్చినట్లు తెలిసింది .

జైలర్ డైరెక్టర్‌కి గిఫ్ట్ గా కాస్ట్లీ కారు..!
Anirudh

ఇక జైలర్ మూవీ సక్సెస్ వెనుక ఉన్న అనిరుద్ కి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వచ్చని టాక్ నడుస్తోంది. జైలర్ కి అనిరుద్ మంచి సంగీతాన్ని కూడా అందించారు. సినిమా హిట్ అవడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిన విషయం మనకి తెలిసిందే కనుక కచ్చితంగా అనిరుద్ కి కూడా మంచి గిఫ్ట్ ఉంటుందని అంతా అంటున్నారు మూవీ కి భారీ లాభాలు వచ్చాయి రజనీకాంత్ కి కూడా బాగా రెమ్యూనరేషన్ ఇచ్చారు. నిర్మాత తో పాటుగా డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసుల పంట పండిందనే మనం చెప్పాలి. కన్నడలోనే కాకుండా తెలుగు మలయాళం హిందీలో కూడా ఈ మూవీ మంచి హిట్ అయింది.