అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే…?

అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే...?
Latest News

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజి’ . సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. నేడు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘హంగ్రీ చీతా’ పేరుతో మేకర్స్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

అర్జున్‌ దాస్‌ వాయిస్‌తో మొదలైన ఈ గ్లింప్స్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. పవన్‌కల్యాణ్‌ ఎలివేషన్స్‌ చూస్తుంటే రోమాలు నిక్కబోడిచేలా ఉన్నాయి. ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్‌ లుక్స్ పవర్ ఫుల్లు డైలాగ్‌లు అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేలా ఉన్నాయి. ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ఇమ్రన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌, శ్రేయారెడ్డి, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్‌ ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి! ” అయిన నరికిన నరకుడు మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది..

అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే...?
Pavan Kalyan

అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే .. సాలా.. షేక్‌.. షివర్‌ ఆ జాయేగా’’ అంటూ అర్జున్‌ దాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత.చూపుగాని విసిరితే ఒర కంట డెత్‌ కోట కన్ఫమ్‌ అంట…ఎవరికీ అందనిది అతని రేంజ్‌’’అంటూ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అదిరిపోయేలా ఉంది.