రెచ్చిపోయిన పవన్ అభిమానులు

రెచ్చి పోయిన పవన్ అభిమానులు

టాలీవుడ్ హీరోలకు ఉన్న కల్ట్ ఫాలోయింగ్ మళ్ళీ మన దక్షిణాదిలో కోలీవుడ్ హీరోలకు ఉంటుంది. మన హీరోలను ఏ స్థాయిలో ఆరాధిస్తారో అంతే స్థాయిలో అక్కడి హీరోలను కూడా ఆరాధిస్తారు. ఇక ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ సంబరాల విషయంలో అయితే కోలీవుడ్ ఫ్యాన్స్ కాస్త వెనుకే అని చెప్పాలి.

మన వాళ్ళు ట్విట్టర్ లో ఏదన్నా ఒక ట్రెండ్ టార్గెట్ పెట్టుకుంటే దానిని కొట్టి చూపిస్తారు. అలంటి వారిలో మన స్టార్ హీరోల అభిమానులు ఎవరికెవరు తీసిపోరు. ముఖ్యంగా పవన్ మరియు మహేష్ అభిమానులు. ఈ మధ్య కాలంలో తమ అభిమాన హీరోల సినిమాలు కొన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ట్విట్టర్ లో భారీ ట్రెండ్స్ కు శ్రీకారం చుట్టారు.

డార్లింగ్ సినిమా పదేళ్లు పూర్తి చేసుకునే సరికి దానికి గాను దగ్గరగా 4 మిలియన్ ట్వీట్స్ తో రచ్చ లేపగా దానిని కాస్త మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమా ట్రెండ్ తో భారీ మార్జిన్ లో కొట్టారు. 8 మిలియన్ ట్వీట్స్ కు పైగా వేసి టాలీవుడ్ లోనే అతి పెద్ద ట్రెండ్ గా నెలకొల్పగా పవన్ ఫ్యాన్స్ ముందు పెద్ద టార్గెట్టే నిలిచింది. దీనితో దాన్ని బద్దలు కొట్టేందుకు ఇప్పుడే ట్రెండ్ స్టార్ట్ చేసారు మరి ఆ టార్గెట్ ను వీరు కొడతారో లేదో చూడాలి.