యువ వికెట్‌ కీపర్‌ రిషప్ పంత్ పై విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టిన క్రికెట్ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి

యువ వికెట్‌ కీపర్‌ రిషప్ పంత్ పై విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టిన క్రికెట్ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి

ఈ మధ్యకాలంలో యువ వికెట్‌కీపర్‌ రిషప్ పంత్ ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కువ వినపడుతున్నాయి. అయితే ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి  కాస్త ఘాటుగా తనదైన శైలిలో స్పందించాడు. భారత క్రికెట్‌ జట్టు ప్రధానకోచ్‌ బాధ్యతలు తీసుకున్నది తబలా వాయించడానికి కాదు అంటూ, ఆటగాళ్లను మెరుగుపరచడం తన బాధ్యత అంటూ…తాను ఊరికేలేనని మండిపడ్డారు. కొన్ని తప్పుడు షాట్ల కారణంగా రిషభ్‌ పంత్‌ కాస్త వెనకంజలో ఉన్నాడు. కొంచెం ఓపిక పట్టి చూస్తే ఈ వరల్డ్‌క్లాస్‌ ఆటగాడు మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపిస్తాడు,ఆ సత్తా పంత్ లో ఉంది అంటూ,తనకి అండగా నిలవాలి అంటూ సూచించాడు. అలాంటి తప్పిదాలని తగ్గించడానికే నేను ఉన్నాను అని తెలిపారు.

నిపుణులు వారి పనిని వారు సమర్ధంగా నిర్వహిస్తు, ఎవరు ఏమిటని గమనిస్తూనే ఉంటారు. ఒక ప్రత్యేకత కలిగిన పంత్‌ని మీడియా భారత్‌ క్రికెట్‌కి ఒక ఆయుధమని చెప్తుంది.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రవిశాస్త్రి కాస్త ఘాటుగా మాట్లాడుతూ పంత్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్‌ అండగా ఉండడం వల్ల తప్పకుండా రాణిస్తాడు అని బదులిచ్చాడు.

ఇదే కాకుండా గంభీర్‌ వ్యాఖ్యానిస్తూ రిషభ్‌ పంత్‌కు రవిశాస్త్రి అండ్‌ కంపెనీ అండగా నిలుస్తుంది అని చెప్పారు. పంత్‌ అవసరంఏ ముందంటూ రవిశాస్త్రి,కోహ్లిలనే గంభీర్‌ టార్గెట్‌ చేస్తూప్రశ్నించాడు. వీరివల్లనే పంత్‌ జట్టులోఉన్నదని విమర్శించాడు. దీనివల్లనే రవిశాస్త్రి కాస్త ఘాటుగా తనదైన శైలిలో సమాదనం ఇచ్చినట్లు అర్థం అవుతుంది.