Crime: న్యూడ్ వీడియోలు కోసం బెదిరింపు.. నేరస్తుడు అరెస్ట్

Crime: Threat for nude videos.. Criminal arrested
Crime: Threat for nude videos.. Criminal arrested

ఇన్స్టాగ్రామ్ ల్లో యువతులను ట్రాప్ చేస్తున్న జిష్ణు కీర్తన్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. యువతి పేరుతో ఇన్స్టాగ్రామ్ ల్లో రిక్వెస్ట్లు పంపించేవాడు. అమ్మాయే అనుకొని నమ్మినవారు పరిచయం పెరిగాక వారి ప్రైవేటు ఫొటోలను కూడా పంపించారు. ఇదే అదునుగా.. వాటిని అడ్డం పెట్టుకొని సామాజిక మాధ్యమాల్లో పెడతానని జిష్ణు కీర్తన్ బెదిరింపులకు పాల్పడేవాడు. న్యూడ్ వీడియోలు పంపకపోతే వారి ఫాలోవర్స్కు ఆ ఫొటోలు పంపుతానని బెదిరిస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.