గోపీచంద్ ‘భీమా’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్..!

గోపీచంద్ ‘భీమా’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్..!
Cinema News

యక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం కన్నడ యువ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా భీమా.

అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు కలిగిన ఈ సినిమా లో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కెజిఎఫ్ మూవీ ల సంగీత దర్శకడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై భీమా సినిమా ని కేకే రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

గోపీచంద్ ‘భీమా’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కి  డేట్, టైం ఫిక్స్..!
Bheema Movie

విషయం ఏమిటంటే, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని జనవరి 5 న మధ్యాహ్నం 1 గం. 11 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా హీరో గోపీచంద్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది.