“గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిఫరెంట్ ప్లాన్…

గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిఫరెంట్ ప్లాన్...
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా గుంటూరు కారం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా అందరినీ ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిఫరెంట్ ప్లాన్...
Guntur Karam

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదల కానుంది. విషయం ఏమిటంటే, ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిఫరెంట్ స్టైల్ లో ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈవెంట్ ని ఇప్పటివరకు టాలీవుడ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మాదిరిగా కాకుండా పరిమిత ఫ్యాన్స్, గెస్టుల మధ్యన నిర్వహించి, ఆ తరువాత దానిని టెలికాస్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు . అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై గుంటూరు కారం మేకర్స్ నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉన్నది .