మిస్టర్ పర్ఫెక్ట్ కాపీనే….కోర్టు తీర్పు !

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా కథ తనదేనంటూ రచయిత్రి శ్యామలాదేవి కోర్టును ఆశ్రయించారు. తాను రచించిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవలను కాపీ కొట్టి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం రూపొందించారంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై అప్పట్లో న్యాయస్థానం ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుకు సమన్లు కూడా పంపారు. అప్పటినుంచి కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారం చివరికి ఓ కొలిక్కి వచ్చింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం ‘నా మనసు కోరింది నిన్నే’ నవలకు కాపీయేనని హైదరాబాద్ సివిల్ కోర్టు ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిపై శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రంలోని ప్రతి పాత్ర తన నవల నుంచి కాపీ కొట్టిందేనని స్పష్టం చేశారు. అప్పట్లో ఈ విషయం దిల్ రాజుతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన కలిసేందుకు సుముఖత చూపలేదని అన్నారు.