సల్మాన్ ఖాన్ ‘భారత్’ ట్రైలర్ !

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమా ఈ ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బేనర్ పై రూపొందిస్తున్న ‘భారత్’ ట్రైలర్ ను ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది. ‘దేశానికి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో అప్పుడే నా కథ మొదలైంది’ అంటూ సల్మాన్ ఖాన్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్ లో సల్మాన్ యాక్టింగ్ అదరగొట్టింది. సల్మాన్- కత్రినా కైఫ్ సన్నివేశాలతో పాటు ఓ కార్మికుడిలా, నేవీ అధికారిగా, సర్కస్ ఫీట్స్ చేస్తూ సల్మాన్ కనబడతాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిస్తున్నఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.