బిగ్ బాస్ సీజన్ 3…వీరే కంటెస్టెంట్లు !

బిగ్ బాస్ సీజన్ 3కి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ ఉండటంతో తెలుగులో ప్రయోగాత్మకంగా 2017లో సీజన్ 1 స్టార్ట్ చేయగా.. ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో సూపర్ సక్సెస్ అయ్యింది. అనంతరం 2018లో నేచురల్ స్టార్ సీజన్ 2కి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్‌ కోసం హోస్ట్‌తో పాటు కంటెస్టెంట్స్‌ను వెతికే పనిలో పడింది స్టార్ మా సంస్థ. హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని ఆసక్తిచూపించకపోవడంతో.. విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రానా ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో బిగ్ బాస్ హోస్ట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తేసీజన్ 3లో కంటెస్టెంట్స్ వీక్ అనే లోటును తీర్చేందుకు పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతుందట స్టార్ మా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని రకారం , సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి, టీవీ నటి హరిత, వరుణ్ సందేశ్, హేమ చంద్ర, యాంకర్ ఉదయభాను, హీరో కమల్ రాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి రమేష్, కొరియోగ్రాఫర్ రఘు, బిత్తిర సత్తి, కామన్‌మెన్, కామన్ ఉమెన్ అంటూ ఉన్న ఈ 15 మందిలిస్ట్‌లో ఫైనల్ అయ్యేది ఎవరు? బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేసేదెవరు? ఇంతకీ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం కానుంది తదితర విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.