పెళ్లి జంటలకి దిల్ రాజు బంపర్ ఆఫర్ !

Dil raju bumper offer for marriage couples

నితిన్, రాశీ ఖన్నా జంటగా శ్రీనివాస కల్యాణం సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. దీనిలో భాగంగా దిల్ రాజు శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే జంటలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దాని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోనున్న ఎన్నో జంటలకి దిల్ రాజు బ్యానర్    నుండి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Dil raju

ఈ నెలలోనే సినిమా విడుదల కానుండగా దర్శకుడు సతీష్ చెప్పిన ఆ ఆలోచన కళామందిర్ కల్యాణ్‌కు చెప్పగానే వారు కూడా సహకరిస్తామని ముందుకు రావడంతో ఈ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకోబోతున్న జంటలకు తమ టీమ్ పట్టు వస్త్రాలను బహుమతిగా ఇవ్వనుందని చెప్పారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందేలా వెంకన్న ఆలయంలో పూజలు జరిపించి వీటిని అందిస్తామని ఆయన అన్నారు. దానికి శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జరగబోతున్న జంటలు, తమ వెడ్డింగ్ కార్డును పంపితే వారికి పట్టు వస్త్రాలను పంపుతామని, కొంతమంది ఎంపిక చేసిన జంటలకు తమ ‘శ్రీనివాస కళ్యాణం‘ టీమ్ స్వయంగా వచ్చి దుస్తులను అందిస్తుందని ప్రకటించారు.