ఆ సీటు కోసం ఇద్దరు…ఎవరికో ఆ భాగ్యం… !

Anam and Nedurumalli for Venkatagiri ycp Ticket

ఏపీ మాజీ సీఎం నేదరుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవడం పార్టీలో చేరతానని ప్రకటించడం ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయంసంగా మారింది. రామ్ ‌కుమార్ రెడ్డి వైసీపీలోకి చేరబోతున్నాడని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్న ఆయన తాజాగా ఆ పార్టీలో పదవిని కూడా పొందారు. అయితే పదవి ఇలా ప్రకటించారో లేదో ఆయన జగన్ తో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఆయన త్వరలోనే వైసీపీలోకి చేరవచ్చు అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.Anam and Nedurumalli for Venkatagiri ycp Ticket

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరివ నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేదురుమల్లి తనయుడు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈమేరకు ఆయన జగన్ ని హామీ కూడా అడిగారని దీనికి జగన్ మాత్రం వేరే సమాధానం చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నారు ఆయనకీ కూడా వెంకటగిరి నియోజకవర్గం మీదనే కన్నేసినట్టుగా నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెంకటగిరి సీటు కోసం మరో బ్యాక్ గ్రౌండ్ ఉన్న పార్టీ నుండి పోటీ రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరిద్దరిలో జగన్ ఎవరికి ప్రాధాన్యతను ఇస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటగిరి సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించగలిగే సత్తా అయితే ఆయనకు మాత్రమె ఉంది. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో ?