విశ్వరూపంకు గడ్డు పరిస్థితి…!

Viswaroopam 2 Is Coming To The Audience

దాంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్‌ కొనుగోలు చేయలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు కోట్లకు ఎన్వీ ప్రసాద్‌కు హోల్‌ సేల్‌గా కమల్‌ ఈ చిత్రాన్ని కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో కమల్‌ హాసన్‌ మరియు ఆస్కార్‌ రవిచంద్రన్‌లు ఎన్వీ ప్రసాద్‌కు బాకీ ఉన్నారు. ఆ బాకీని ఇలా విశ్వరూపంను బలవంతంగా చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాలని వారు భావించారు.Vishwaroopam-2-Movie-Postpo

ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని వద్దు వద్దు అంటూనే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కమల్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు రావాల్సిన రెండు కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే విశ్వరూపం తీసుకుని వచ్చినంత వరకు తన ఖాతాలో వేసేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ చిత్రంకు పోటీగా శ్రీనివాస కళ్యాణం మరియు గీత గోవిందం చిత్రాలు ఉన్న కారణంగా వసూళ్లు రాబట్టడం కష్టమే అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున థియేటర్లు లభించడం కూడా కష్టంగానే ఉంది. ఒక వైపు దిల్‌రాజు, ఒక వైపు అల్లు అరవింద్‌ చిత్రాలు విశ్వరూపం 2కు ఉన్న కారణంగా థియేటర్లు తక్కువ లభిస్తాయని ముందే చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. అయినా కూడా తమిళంలో విడుదల చేసిన సమయంలోనే తెలుగులో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో అదే రోజున విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఫలితం కాస్త తారు మారు అయినా కూడా విశ్వరూపం కనిపించకుండా పోయే అవకాశం ఉంది. శ్రీనివాస కళ్యాణం మరియు గీత గోవిందం చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్నాయి కనుక డబ్బింగ్‌ చిత్రం అయిన విశ్వరూపం 2 ను ఎవరు పట్టించుకోక పోవచ్చు. అందుకే విశ్వరూపంకు గడ్డు పరిస్థితి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.