కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నన్ను ఐదేళ్ళు వాడుకున్నాడు…

Lady sexual allegations on congress Ex mla

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పవర్ఫుల్ లీడర్ అయిన గండ్ర వెంకటరమణా రెడ్డి మీద లైంగికఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆయన తనను ఐదేళ్ళ పాటు శారీరకంగా వాడుకుని ఇప్పుడు తాను ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తున్నాడని వరంగల్ కి చెందిన మదర్ ఫౌండేషన్ ప్రతినిధి కొమురేల్లి విజలక్ష్మి రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై నిలదీసినందుకు నాపై కేసుపెట్టి పోలీసులతో అరెస్టు చేయించాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను నిర్వహించే మదర్ ఫౌండేషన్ పనుల మీద రెండు మూడు సార్లు ఆయనతో ఏర్పడిన పరిచయం శారీరిక సంబంధానికి దారి తీసిందని వరంగల్ లో గండ్ర సొంత ఫంక్షన్‌హాల్‌‌తో పాటు ఆయన నివాసంలోనూ అనేకసార్లు ఏకాంతంగా కలిశామని, నాలుగు రోజుల క్రితం వరకూ బాగానే ఉన్న ఆయన ఎందుకు ఇప్పుడు ప్లేటు మార్చేసి ఆయన తన మీద తన మనుషులతో దాడి చేయించాడు అనేది తెలియడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు.

Lady-sexual-allegations-on-

ఆగష్టు మూడున ఆయన ఇంటికి వెళితే పోలీసులతో అరెస్టు చేయించి తన వద్దనున్న ఫోన్లు, డబ్బు లాక్కునేలా పోలీసులని ప్రభావిస్తం చేసాడని, తమ మధ్య ఉన్న సంబంధానికి ఆధారాలన్నీ ఆ ఫోన్లలోనే ఉన్నాయని అందుకే పోలీసులతో ఆ ఫోన్లు లాక్కున్నారని ఆమె ఆరోపిస్తోంది. అయితే రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ఆమెనీ ఆమె మద్దతుదారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆమె లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు గండ్ర మీద కేస్ ఫైల్ చేశారు. అయితే ఈ ఘటన గురించి స్పందించిన గండ్ర తాను అమాయకుడిని అని ఆమె చేస్తున్న ఆరోపణలు తనకే షాకింగ్ గా ఉన్నాయని రాజకీయంగా ఎదుర్కోలేనివారే ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన ఈ ఆరోపణలు కొట్టి పారేశారు.

Ex-mla-gandra-venkata-raman