మాస్టర్ ప్లాన్ వేసిన దిల్ రాజు

మాస్టర్ ప్లాన్ వేసిన దిల్ రాజు

పింక్ సినిమా కోసం పవన్ చాల కష్టపడుతున్నారు. ఒక పక్క రాజకీయాలు చూసుకుంటూనే, మరో పక్క సినిమాలో నటిస్తున్నారు. అయితే పవన్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రం లో హీరోయిన్ కోసం దిల్ రాజు చాల కష్టపడుతున్నారు. పవన్ తో చిత్రం అంటే హీరోయిన్ లు ఎగిరి గంతేసే అవకాశం వుంది. కానీ ఈ చిత్రం లో పవన్ సరసన చేయాల్సిన హీరోయిన్ పాత్రకు ఒక బిడ్డ ఉంటుంది. తల్లి పాత్ర చేయడానికి పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ అంతగా ఆసక్తి కనబరుచుట లేదు. అయితే ఈ చిత్రం కోసం దిల్ రాజు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

పవన్ పింక్ రీమేక్ లో హీరోయిన్ గా రేణు దేశాయ్ ని ఒప్పించేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తాజాగా చూసి చూడంగానే చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన రేణు దేశాయ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరిచింది. తనకు ఆ చిత్రంలో అవకాశం వచ్చినా ఆరోగ్యం బాగోలేక చేయలేదని తెలిపింది. అయితే ఈ చిత్రం లో పవన్ తో నటించేందుకు రేణు దేశాయ్ అంగీకరిస్తుందో లేదో చూడాలి, ఒక వేళ రేణు దేశాయ్ ఒప్పుకున్నా పవన్ దీనికి ఒప్పుకుంటారో లేదో మరి.