గాలి ద్వారా కూడా వ్యాపించే అతి భయంకరమైన కరోనా వైరస్

గాలి ద్వారా కూడా వ్యాపించే అతి భయంకరమైన కరోనా వైరస్

ప్రపంచమంతా కరోనా వైరస్ ని చూసి భయపడుతుంది. అయితే ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. అయితే కేరళకి చెందిన ఒక విద్యార్థికి వైరస్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపించే అతి భయంకరమైన వ్యాధి. ఆ విద్యార్థికి కేరళలో ఒక ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్య సదుపాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విషయాన్నీ కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించడం తో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఆ విద్యార్థిని అబ్సర్వేషన్ లో ఉంచి పరిశీలిస్తున్నాం అని అక్కడి వైద్యులు తెలిపారు.

ఈ విద్యార్థి చైనా లో వుహాన్ యూనివర్సిటీ లో మెడిసిన్ చదువుతున్నాడు. అయితే చైనాలో దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. చదువు నిమిత్తం వారు చైనాకి వెళ్లినట్లు తెలుస్తుంది. చైనా నుండి వచ్చే భారతీయలను కాపాడుకోవడానికి భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఎయిర్పోర్ట్ లలో ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్ సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి వచ్చే వారి వివరాలు సేకరించి జాగ్రత్తగా వుండాలంటూ సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ వలన దాదాపు 170 మంది మరణించారు.