‘ఎన్టీఆర్‌’గా బాలయ్య మొదటి గెటప్‌

Krish Release Balakrishna Getup in NTR movie

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లింది. దాదాపు ఆరు నెలలుగా ఈ చిత్రం గురించి అదుగో ఇదుగో అంటూ జరుపుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్‌కు క్లాప్‌ పడటం జరిగింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ సినిమాల కోసం వేసుకున్న దాదాపు వంద గెటప్స్‌ను బాలకృష్ణతో వేయించేందుకు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు క్రిష్‌ ఎక్కడ రాజీ పడకుండా మెల్లగా చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యింది.

షూటింగ్‌ ప్రారంభం రోజు అయిన నిన్న ఎన్టీఆర్‌ మొదటి సినిమా చిత్రీకరణ ఎలా సాగింది, ఎలా సినిమాల్లోకి ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చాడు అనే విషయాలను చూపించబోతున్నారు. అందుకోసం ఎన్టీఆర్‌ గెటప్‌ను బాలయ్య వేసుకోవడం జరిగింది. మొదటి రోజే ఫస్ట్‌లుక్‌ను క్రిష్‌ విడుదల చేశాడు. ఎన్టీఆర్‌ లుక్‌లో బాలయ్య సూపర్బ్‌ అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌ నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు మరియు సినీ ప్రముఖులు కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.