అహం బ్రహ్మాస్మిని రివీల్‌ చేసిన క్రిష్‌

Krish to do aham brahmasmi movie with Balakrishna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న క్రిష్‌ గత సంవత్సరం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సమయంలోనే క్రిష్‌ తన తర్వాత సినిమా సన్నాహకంలో మునిగి పోయాడు. క్రిష్‌ తర్వాత సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ అని ఇటీవలే ఖరారు అయ్యింది. అయితే ఆ సినిమాలో హీరో ఎవ్వరు అయ్యి ఉంటారు అనే చర్చ నిన్న మొన్నటి వరకు జరిగింది. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది.

‘అహం బ్రహ్మాస్మి’ చిత్రాన్ని బాలయ్యతో క్రిష్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్‌’ చిత్ర పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయితే కాని మరో సినిమాను కమిట్‌ అయ్యే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో క్రిష్‌కు బాలయ్య ఎలా ఓకే చెప్పాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బాలయ్యతో సినిమాను చేసేందుకు వినాయక్‌ కూడా కర్చిఫ్‌ వేసి మరీ ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే క్రిష్‌తో బాలయ్య సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంటే ‘మణికర్ణిక’ చిత్రం పూర్తి అయిన తర్వాత ఒక చిత్రాన్ని చేసి ఆ తర్వాత బాలయ్యతో ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంను చేసే అవకాశం ఉంది. క్రిష్‌తో సినిమా చేస్తాను అని బాలయ్య గతంలోనే హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు వచ్చే సంవత్సరంలో డేట్లు ఇస్తాడేమో చూడాలి.