సీఎం సమక్షంలో దిశ యాప్‌ అవగాహన సదస్సు

సీఎం సమక్షంలో దిశ యాప్‌ అవగాహన సదస్సు

విజయవాడ గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్‌ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్‌ లైవ్‌ డెమో చేసి చూపించారు. యాప్‌ నుంచి మెసేజ్‌ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా వాలంటీర్లు సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చింది అన్నారు. జగనన్న లాంటి ముఖ్యమంత్రిని తాము ఎక్కడా చూడలేదని తెలిపారు. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించడం గొప్ప చర్య అన్నారు వాలంటీర్లు.

ఇక ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు.