‘గుంటూరు కారం’ పై క్రేజీ అప్ డేట్ అందించిన ‘డీజే టిల్లు’

‘గుంటూరు కారం’ పై క్రేజీ అప్ డేట్ అందించిన ‘డీజే టిల్లు’
Latest News

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా డీజే టిల్లు స్క్వేర్ మూవీలో హీరోగా నటిస్తున్నారు. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు సిద్దు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే చినబాబు గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు .

ఇవాళ గుంటూరు కారం సినిమా లో ఒక సూపర్ సాంగ్ ని తెరకెక్కించారు. ఇటీవల కాలంలో ఇటువంటి సాంగ్ ని నేను చూడలేదు, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ఈ సాంగ్ కి థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం అని అన్నారని చెప్పారు. నిజానికి చినబాబు గారు ఎక్కువగా మాట్లాడరని, అటువంటిది ఆయన ఈరోజు ఇలా చెప్పారు అంటే ఇక మీరే ఊహించుకోవచ్చని అన్నారు సిద్దు. మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

‘గుంటూరు కారం’ పై క్రేజీ అప్ డేట్ అందించిన ‘డీజే టిల్లు’
DJ.Tillu

ఓవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ స్టోరీ, స్క్రిప్ట్, టేకింగ్ ని అదరగొడుతు ఉంటె మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాంగ్స్, బీజీఎమ్ ని అత్యద్భుతంగా సిద్ధం చేస్తున్నారని, తప్పకుండా రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం ఆడియన్స్ కి సూపర్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించడం ఖాయం అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగం నిర్మాత నాగవంశీ వెల్లడించాడు . శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమా లో హీరోయిన్స్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు, సునీల్, ఆలీ, హైపర్ ఆది నటిస్తున్నారు.