‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ..!

Do you know when the teaser of 'Double Smart' will be released?
Do you know when the teaser of 'Double Smart' will be released?

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఐతే, మే 15, 2024న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలవుతుందని తెలుస్తుంది . ప్రస్తుతం ఈ టీజర్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ టీజర్ విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

Do you know when the teaser of 'Double Smart' will be released?
Do you know when the teaser of ‘Double Smart’ will be released?

కాగా ఈ సినిమా లో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ మూవీ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ మూవీ ని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో అనేది చూడాలి.