వివాహేతర సంబంధం… వీడు కన్నతండ్రా ? మదమెక్కిన మృగమా ?

drunk man bashes his 3 years old son against auto in Hyderabad

కోపం కొద్ది సేపటికి తగ్గిపోతుంది. ఆగ్రహం వస్తే ఇంకొంచెంసేపు పడుతుంది తగ్గటానికి. కానీ పసిబిడ్డను నేలకేసి బాదేసినా ఆగ్రహం తగ్గలేదు అంటే దాన్ని ఏమంటాం. కొవ్వా ? బలుపా ? లేక కసాయితనమా ఏమనాలి ఆ కొవ్వేక్కిన మదపు తండ్రిని. కన్న తండ్రి అక్రమ సంబంధం పెట్టుకొని పసిపిల్లవాడిపై కసాయిగా మారిన ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో చోటు చేసుకుంది. అసలు మనిషి అనే పదానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన శివ అనే యువకుడు  3 సంవత్సరాల పసి ప్రాణిని అదీ తన కడుపునా పుట్టిన బాబుని చిత్రహింసలకు గురిచేశాడు. జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే మేడిపల్లికి చెందిన శివ, అనుషా 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకుని జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కేపీహెచ్ బిలో రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకొనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొన్న శివ, భార్య అనుషా దగ్గరకు రాకుండా కొంత కాలంగా ఆ మహిళ దగ్గరే ఉంటున్నాడు. అప్పుడప్పుడు అనుషా వద్దకు వచ్చిపోతుండేవాడు. అదే క్రమంలో గతరాత్రి రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చిన శివను భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి… గొడవ పెద్దదైంది. అనుషాతో వాగ్వాదానికి దిగి ఉన్మాదిలా ప్రవర్తిస్తూ భార్య అనుషాపై దాడి చేసి తన కొడుకును పోలీసుల ముందే చిత్రహింసలకు గురిచేస్తూ రాక్షసుడులా ప్రవర్తించాడు. జగద్గిరిగుట్ట సీఐ గాయపడిన బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉంది. కాగా శివను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.