“చి ల సౌ” రిలీజ్ డేట్… ఆగస్ట్ 3

chi-la-sow-movie-release-date

నటీనటులు : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ తదితరులు
దర్శకత్వం : రాహుల్‌ రవీంద్రన్‌
నిర్మాతలు : జస్వంత్‌ నడిపల్లి, భరత్‌ కుమార్‌ మలశాల, హరి పులిజల
బ్యానర్ : సిరుని సినీ కార్పొరేషన్‌
సంగీత దర్శకుడు : ప్రశాంత్ విహారి

దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్, సుశాంత్‌తో తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదిని నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్ట్ 3వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్ట్ 3న అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు హీరో సుశాంత్‌ తెలిపారు.