హీరోయిన్‌కు చుక్కలు చూపిన తాగుబోతులు

Drunk Man Misbehaves to Heroine Mehreen in Train

సెలబ్రెటీలు ఎక్కువగా దూర ప్రయాణాలకు విమానాలను ఆశ్రయిస్తారు. కాని తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్‌ మెహ్రీన్‌ హైదరాబాద్‌ నుండి చెన్నైకు ట్రైన్‌లో వెళ్లవల్సి వచ్చింది. విమానం కోసం ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. అందుకే తమిళ నిర్మాత ఆమె కోసం రైల్‌లో టికెట్‌ బుక్‌ చేశాడు. అయితే సరే అనుకున్న ఆమె రైలులో ప్రయాణించేందుకు ఓకే చెప్పింది. అయితే తనకు రిజర్వ్‌ అయిన సీటు వద్ద అప్పటికే ఒక తాగుబోతు కూర్చుని ఉండటంతో ఆమె అతడిని ఖాళీ చేయించలేక పోయింది. దాంతో చాలా సమయం పాటు ఆమె నిల్చుని ప్రయాణం చేయాల్సి వచ్చిందట.

తమిళ చిత్రం ‘నోటా’లో నటించేందుకు చెన్నైకి హైదరాబాద్‌ నుండి మెహ్రీన్‌ వెళ్లాల్సి వచ్చింది. చివరి నిమిషంలో షెడ్యూల్‌ ఖరారు అవ్వడంతో హీరోయిన్‌కు ఎయిర్‌ బస్‌ టికెట్‌ను నిర్మాత ఇవ్వలేక పోయాడు. మెహ్రీన్‌ పర్వాలేదు రైల్లో వచ్చేస్తానంటూ చెప్పడంతో సదరు నిర్మాత రైలు టికెట్‌ను బుక్‌ చేయడం జరిగింది. తన సీటును అతడు ఖాళీ చేయక పోవడంతో ఏం చేయాలో తెలియక ఆమె చాలా సమయం నిల్చుని ఉండి, నిర్మాతకు ఫోన్‌ చేసింది. దాంతో నిర్మాత మనుషులను కారులో పంపి, తర్వాత స్టేషన్‌లో మెహ్రీన్‌ను దించి, అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఆమెను చెన్నైకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని మెహ్రీన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.