యాత్రలో భాగస్వామ్యం కాబోతున్న రంగమ్మత్త

Anasuya to act in Mammootty Yatra movie

దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ రెడ్డి పాత్రను మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటి పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో పలువురు స్టార్‌ నటీనటులు కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. ఏకదాటిగా చేయబోతున్న షెడ్యూల్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాను ఉత్తరాంధ్రాలో చిత్రీకరిస్తున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఒక మహిళ నేతతో రాజశేఖర్‌ రెడ్డి చాలా ఆప్యాయంగా ఉండే వారు. ఆమెకు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలను కూడా అప్పగించాడు. ఆ పాత్రను యాంకర్‌ అనసూయతో చేయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల పాటు అనసూయ డేట్ల కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు సంప్రదించారని తెలుస్తోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర పోషించిన తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అనసూయ ఒకవైపు బుల్లి తెరను, ఒక వైపు వెండి తెరకు సమ న్యాయం చేస్తూ ఈ అమ్మడు చేసుకుంటూ వెళ్తుంది. యాత్ర చిత్రంలో ఒక ముఖ్యమైన గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్న ఈ అమ్మడు ముందు ముందు పెద్ద చిత్రాల్లో ఫుల్‌లెంగ్త్‌ పాత్రలతో రాబోతుంది.