హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ రివ్యూ…

happy wedding trailer

మెగా డాటర్‌ నిహారిక మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నటిగా మాత్రం ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రం తర్వాత ఈమె నటిస్తున్న చిత్రం ‘హ్యాపీవెడ్డింగ్‌’. యూవీ క్రియేషన్స్‌ వారి సారధ్యంలో తెరకెక్కడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించారు. మొదటి సినిమాలో నిహారిక కాస్త జాగ్రత్తగా, హీరోకు దూరం దూరంగా ఉంటూ నటించింది. అయితే ఈ చిత్రంలో మాత్రం రెగ్యులర్‌, కమర్షియల్‌ హీరోయిన్స్‌ మాదిరిగా నటించేసిందని తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. నిహారికకు ఈ చిత్రం మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ను తెచ్చి పెట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఈ చిత్రం ట్రైలర్‌ చాలా కర్‌ ఫుల్‌గా ఉండి ఆకట్టుకుంటుంది. కథ మరియు కథనం విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. పక్కా కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్‌ కార్య తెరకెక్కించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో నిహారికతో పాటు సుమంత్‌ అశ్విన్‌ నటిస్తున్నాడు. ఇద్దరి కాంబోకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇద్దరు కూడా క్యూట్‌గా, ఆకట్టుకునే విధంగా, చక్కని జంటగా ఉన్నారు అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంటున్నారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉండటంతో ట్రైలర్‌తో పాటు సినిమా కూడా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంను వచ్చే నెలలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి, ఆ తర్వాత నెలలో అంటే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం విడుదలైతే నిహారిక హీరోయిన్‌గా ఇంకా పలు చిత్రాలను ఆశించవచ్చు.