ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న ‘ఈగ‌’

eega completed seven years

నాని, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈగ‌. జూలై 6,2012న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈగ చిత్రం విడుద‌లై నేటికి ఏడేళ్ళు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసిన కెకె సెంథిల్ కుమార్ త‌న ట్వీట్‌లో.. ఈగ చిత్రం నేటితో ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు పని చేసిన చిత్రాల‌న్నింటికెల్లా ఎక్కువ ఛాలెంజింగ్ చిత్రం అంటే అది ఈగ అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అద్భుత చిత్రంలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది అని సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. ఈగ చిత్రం స‌క్సెస్‌లో న‌టీన‌టుల ప్ర‌తిభ‌నే కాక విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా భాగం అయ్యాయి. క‌న్నడ హీరో సుదీప్ ఇందులో నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించి అల‌రించాడు. శ్రీనివాస‌రెడ్డి, నోయ‌ల్ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించారు