‘ఈగ’తో విజేతకు సంబంధం ఏంటీ?

vijetha movie to release on eega day

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి అద్బుత సృష్టి ‘ఈగ’. తెలుగులో స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రమే కాదు, జక్కన్న ఏ సినిమా చేసినా కలెక్షన్స్‌ వస్తాయంటూ నిరూపించిన చిత్రం ‘ఈగ’. ఒక ఈగతో సినిమాను చేసి ఇండియాలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఈగ సినిమాతో మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ నటించిన ‘విజేత’ చిత్రానికి సంబంధం ఏర్పడటం జరిగింది. ఈ రెండు సినిమాల మద్య సంబంధం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా, అసలు విషయం ఏంటీ అంటే ఈగ విడుదలైన జులై 6వ తారీకునే ‘విజేత’ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సాయి కొర్రపాటి నిర్ణయించాడు. ఈగ సినిమాకు కూడా నిర్మాత సాయి కొర్రపాటే అనే విషయం తెల్సిందే.

తన ‘ఈగ’ సినిమాను విడుదల చేసిన రోజే మెగా మూవీ ‘విజేత’ను కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. విజేత మూవీలో కళ్యాణ్‌కు జోడీగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై అంచనాలు పెంచేసింది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ నటనలో కాస్త ఇంప్రూవ్‌ అవ్వాలనే టాక్‌ వినిపించినా కూడా మొత్తంగా చూస్తే టీజర్‌ ఆకట్టుకుంది. తండ్రి, కొడుకుల మద్య జరిగే సీన్స్‌ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఈగ సెంటిమెంట్‌తో విడుదల కాబోతున్న విజేత చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈమద్య కాలంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోలు అంతా కూడా సో సో సక్సెస్‌లతోనే కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. మరి కళ్యాణ్‌ అయినా మంచి సక్సెస్‌లను అందుకుంటాడేమో చూడాలి.