‘నా నువ్వే’ ప్రివ్యూ

Naa Nuvve Movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కళ్యాణ్‌ రామ్‌ ఇటీవలే ‘ఎమ్మెల్యే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిజాస్టర్‌గా నిలిచిన ఆ సినిమా ఫలితం నుండి వెంటనే తేరుకున్న కళ్యాణ్‌ రామ్‌ తాజాగా ‘నానువ్వే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా తమన్నా నిలువబోతుంది. కళ్యాణ్‌ రామ్‌, తమన్నాల కాంబినేషన్‌లో మొదటి సారి తెరకెక్కిన ఈ చిత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ మళ్లీ మళ్లీ పాల్గొనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విభిన్న కథాంశంతో కళ్యాణ్‌ రామ్‌ను న్యూ లుక్‌తో ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ మరియు ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైలర్‌లో చాలా విభిన్నమైన ప్రేమ కథను చూపించబోతున్నట్లుగా దర్శకుడు చెప్పకనే చెప్పాడు. దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను జయేంద్ర తెరకెక్కించి ఉంటాడు అనే నమ్మకం వ్యక్తం అవుతుంది. జయేంద్ర గతంలో తెరకెక్కించిన సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఈ సినిమాపై నమ్మకంను కలిగి ఉన్న కళ్యాణ్‌ రామ్‌ ఆశలు అడియాశలు అవుతాయా లేదంటే కెరీర్‌లో మరో సక్సెస్‌ను ఆయన దక్కించుకుంటాడా అనేది చూడాలి. ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో ఈ సినిమాకు మంచి బిజినెస్‌ అయినట్లుగా తెలుస్తోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.