ఏక్-దో-తీన్ రీమిక్స్ వెర్ష‌న్ లో జాక్వ‌లిన్… వీడియో వైర‌ల్

Ek Do Teen song remake by Jacqueline Fernandez in Baaghi 2
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

1988లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఏక్..దో…తీన్ సాంగ్ రీమిక్స్ వెర్ష‌న్ విడుద‌ల‌యింది. తేజాబ్ సినిమాలోని ఈ సాంగ్ మాధురీ దీక్షిత్ ను ఓవ‌ర్ నైట్ స్టార్ చేసింది. అప్ప‌టికే బాలీవుడ్ ను ఏలుతున్న శ్రీదేవికి మాధురీని పోటీగా నిల‌బెట్టింది. హిందీలోనేకాదు..దేశ‌వ్యాప్తంగానూ ఈ పాట ఉర్రూత‌లూపింది. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ బాలీవుడ్ ఆ సాంగ్ ను రీమిక్స్ చేసింది. 2016లో రిలీజ‌యిన బాఘి సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న బాఘీ 2లో ద‌ర్శ‌కుడు అహ్మ‌ద్ ఖాన్ ఏక్..దో…తీన్ సాంగ్ రీమిక్స్ చేశారు. మాధురి స్థానంలో ఈ పాట‌లో జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ డాన్స్ చేసింది. మాధురి పాట‌ను ప్ర‌ముఖ గాయ‌ని అల్కా యాగ్నిక్ పాడ‌గా… రీమిక్స్ పాట‌ను శ్రేయాఘోష‌ల్ ఆల‌పించింది. అహ్మ‌ద్ ఖాన్ స్వ‌తహాగా కొరియోగ్రాఫ‌ర్ కావ‌డంతో రీమిక్స్ పై చాలా శ్ర‌ద్ధ తీసుకున్నాడు.

పాత పాట‌తో ఈ పాట‌ను పోల్చ‌కుండా అన్నీ కొత్త స్టెప్పులు కంపోజ్ చేశాడు. పాట‌లో ఒకే ఒక్క స్టెప్పు మిన‌హా మిగిలిన‌వ‌న్నీ కొత్త స్టెప్పులే. పాత స్టెప్పులతో పోలిక లేక‌పోవ‌డం వ‌ల్లే తాను భ‌యం క‌ల‌గ‌కుండా డ్యాన్స్ చేయ‌గ‌లిగాన‌ని జాక్వ‌లిన్ తెలిపింది. మాధురీదీక్షిత్ డ్యాన్స్ చేసినంత గొప్ప‌గా ఎవ‌రూ చేయ‌లేర‌ని,ఈ  పాట‌కు త‌న‌ను ఎంచుకున్న‌ప్పుడు మొద‌ట తాను చేయ‌గ‌ల‌నా అని భ‌యం వేసింద‌ని, అయితే అన్నీ కొత్త స్టెప్పుల‌ని తెలియ‌డంతో ఊపిరి పీల్చుకున్నాన‌ని చెప్పుకొచ్చింది. కాగా, మాధురి పాట ఏడు నిమిషాలు ఉండ‌గా..కొత్త పాట రెండు నిమిషాల‌కు త‌క్కువ‌గానే ఉంది. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ కొత్త పాట వైర‌ల్ అవుతోంది.