రీ రిలీజ్ కి సిద్దమైన “ఎటో వెళ్ళిపోయింది మనసు”..!

"Eto Vellipoindi Manasu" is ready for re-release..!

టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని (Nani) చివరిసారిగా హాయ్ నాన్న మూవీ లో కనిపించారు. ఈ మూవీ ప్రేక్షకులని, అభిమానులని అలరించింది. తదుపరి సరిపోదా శనివారం మూవీ లో కనిపించనున్నారు నాని. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే 2012 లో థియేటర్ల లో రిలీజ్ అయిన ఎటో వెళ్ళిపోయింది మనసు మూవీ నాని కెరీర్ లో ఒక కీలక మైలురాయి గా నిలిచింది.

"Eto Vellipoindi Manasu" is ready for re-release..!
“Eto Vellipoindi Manasu” is ready for re-release..!

స్టార్ హీరోయిన్ సమంత ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. త్వరలో ఈ మూవీ థియేటర్ల లోకి మళ్ళీ రానున్నది . అయితే రీ రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా రావాల్సి ఉంది. గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ కు ఇళయరాజా సంగీతం అందించారు.