బిగ్ బాస్ సభ్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే కొడుకు

బిగ్ బాస్ సభ్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే కొడుకు

పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ నటి సంజన పోలీసులకు ఫిర్యాదు చేసారు. బిగ్ బాస్ రెండవ సీజన్ ద్వారా ప్రేక్షకులకు నటి సంజన సుపరిచితురాలు. అయితే తాగి మద్యం మత్తులో వున్న ఆశిష్ గౌడ్ శనివారం రాత్రి నోవాటెల్ హోటల్లో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, అమ్మాయిలను చితకబాది, అడ్డువచ్చిన వారి ఫై దారుణంగా దాడి చేశాడంటూ నటి సంజన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

మద్యం బాటిళ్లతో దాడి చేయడమే కాకుండా, మొదటి అంతస్తు నుండి తోసివేసే ప్రయత్నం చేసాడని నటి సంజన ఆరోపించారు. అయితే ఈ ఘటన రాత్రి రెండు గంటలకు జరిగిందని, అపుడు తాను తన స్నేహితురాలితో వున్నానని తెలిపారు. అయితే భయాందోళనకు గురైన సంజన అక్కడి నుండి తప్పించుకొని బయటపడ్డారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తే అసలు నిజాలు తెలుస్తాయని వివరించింది. దీనికి సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, గతంలో క్రిమినల్ కేసులో ఆశిష్ అరెస్టయ్యాడని తెలిసింది. అంతేకాకుండా ఆశిష్ ఫై పలు ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు.