చిరంజీవిని హీరోగా అంగీకరించని అభిమానులు

చిరంజీవిని హీరోగా అంగీకరించని అభిమానులు

అరవై అయిదేళ్ల వయసులో చిరంజీవి డాన్సులు చేసినా, హీరోయిన్లతో సరసాలు ఆడినా చూడ్డానికి ఇబ్బంది అనిపిస్తుంది. సైరా చిత్రంలో చిరంజీవి, తమన్నాల ఎపిసోడ్ ఆ సినిమాకే కళంకంగా మారి ట్రోల్స్ కి మంచి మేతలా మారింది. అలాగే యుద్ధ సన్నివేశాలలో డూప్ ని వాడడం అభిమానులకి కూడా నచ్చకపోయింది.

వయసు భారం మీద పడడంతో చిరంజీవి మునుపటిలా హీరోలా అన్నిట్లోనూ దూకుడు చూపించలేకపోతున్నారు. అయితే యువ హీరోలతో పోటీ పడాలని, ఇప్పటికీ తన సినిమాలే రికార్డు పుస్తకాల్లో ఉండాలని అయన కోరుకుంటున్నారు. ఇందుకోసం అయన అదే పనిగా కథల కోసం, దర్శకుల కోసం వేటాడడమే కాకుండా చరణ్ సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు.ఇక హీరో వేషాలు మానేసి వయసుకి తగ్గ పాత్రలతో మల్టీ స్టారర్స్ చేస్తే ఉత్తమం అని అభిమానులే సూచిస్తున్నారు.