సోషల్ మీడియా లో కూడా దూసుకు పోతున్న మహేష్ బాబు

సోషల్ మీడియా లో కూడా దూసుకు పోతున్న మహేష్ బాబు

మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా లో కూడా దూసుకు పోతున్నాడు. ఆల్ ఇండియా స్టార్ డం ఉన్న మహేష్ బాబును ట్విట్టర్ లో ఏకంగా 9 మిలియన్ ల మంది ఫాలో అవుతున్నారు. కేవలం సినిమాతో నే కాకుండా బుల్లి తెరపై కూడా పదుల కొద్ది యాడ్స్ తో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. హిందీ బుల్లి తెర ప్రేక్షకులను మహేష్ బాబు డబ్బింగ్ సినిమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

అందుకే అక్కడ కూడా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా తనకున్న ఫ్యాన్స్ కారణంగా సోషల్ మీడియా ట్విట్టర్ లో ఏకంగా 9 మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను పొందాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ స్టార్స్ కూడా ఎవరు ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను కలిగి లేరు. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ 3.4.. రాజమౌళి 4.7 ఇంకా బన్నీ 3.9 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.గత కొన్ని రోజులుగా మెగా 152 చిత్రంలో మహేష్ బాబు నటించబోతున్నాడని.. 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.