సమంత ప్రెగ్నెన్సీ…. సినిమా నుంచి తప్పుకున్న సమంత

సమంత ప్రెగ్నెన్సీ.... సినిమా నుంచి తప్పుకున్న సమంత

విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి `కాథు వాకులా రెండు కాదల్` సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు సమంత చాలా సంతోషించింది. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథ వినిలేదని, విజయ్ సేతుపతి, నయనతార వంటి ప్రతిభావంతులతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సమంత సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఉన్నట్టుండి ఆ సినిమా నుంచి సమంత తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పాత్రల నిడివి విషయంలో నయన్‌తో తలెత్తిన విభేదాల కారణంగానే సమంత ఆ సినిమా నుంచి తప్పుకుందని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. సమంత గర్భం దాల్చిందని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మరోవైపు ప్రచారం జరుగుతోంది. నిజానికి సమంత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుసార్లు వచ్చాయి. వాటికి సమంత కూడా ఘాటుగానే కౌంటర్లు ఇచ్చింది. తాజాగా మరోసారి సమంత ప్రెగ్నెన్సీ వార్తలు బయటకు వచ్చాయి. మరి, వీటికి సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.