1000 కళ్ళతో సలార్ టికెట్స్ కోసం క్యూ లైన్‌లో అభిమానులు..!

1000 కళ్ళతో సలార్ టికెట్స్ కోసం క్యూ లైన్‌లో అభిమానులు..!
Cinema News

ప్రభాస్ సలార్ సినిమా ప్రేక్షకుల్లో రోజు రోజులు ఆసక్తి పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాకు మించి సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సలార్ సినిమా కూడా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ పాన్ ఇండియా సినిమా అయిన సలార్ సినిమాను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగులో మాత్రం ఇంతవరకు ఓపెన్ కాలేదు.

1000 కళ్ళతో  సలార్ టికెట్స్ కోసం క్యూ లైన్‌లో అభిమానులు..!
Salaar movie

ఇక ఇప్పుడు ఆఫ్ లైన్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర క్యూ లైన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు . హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. సలార్ టికెట్స్ కోసం భారీగా క్యూ లైన్ లో నిల్చున్నారు ఫ్యాన్స్. మొదటి రోజు సినిమా చూడటాన్ని అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గర అభిమానులు భారీగా చేరుకొని టికెట్స్ కోసం లైన్ లో నిలుచున్నారు. ఇక సలార్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లు సినిమా పై అంచనాలను తార స్థాయికి చేర్చాయి. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతి బాబు, బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.