కూతుర్ని అందుకే చంపాలనుకున్నా…!

Father Attacks His Daughter For Inter Caste Marriage

ఎర్రగడ్డలో కులాంతర వివాహం చేసుకున్న కూతురి మీదా అతని భర్త మీదా అమ్మాయి తండ్రి కత్తితో పట్టపగలే దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తండ్రి దాడిలో కూతురు మాధవి తీవ్రంగా గాయపడగా ఆమె భర్త సందీప్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అసలు మద్యం అలవాటే లేని మనోహరాచారి ఫుల్లుగా మద్యం సేవించిన మనోహరాచారి మద్యం మత్తులోనే దాడికి పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన మనోహరాచారి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తె ఎంత నచ్చజెప్పినా వినకుండా వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకోవడంతో, పట్టలేని ఆవేశంతో దాడి చేశానన్నాడు. నా బిడ్డను మాత్రమే చంపాలని అనుకున్నాను. సందీప్‌ను చంపాలనుకోలేద’ని పోలీసుల విచారణలో వెల్లడించాడు.

intercast-marriage-hyderaba
మాధవికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చానని ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు చెప్పి కంట తడి పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తీవ్ర మానసిక వేదను గురయ్యానని అందుకే మందు తాగే అలవాటు లేకున్నా కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నాటి నుంచి తాగుతూనే ఉన్నానని చెప్పాడు. తన కోపమంతా మాధవిపైనేనని చెప్పిన చారి సందీప్ మీద ఆవేశంలో దాడి చేశాను. అంతేగానీ అతణ్ని హతమార్చాలని భావించలేదని స్పష్టం చేశాడు.

intercast-marriage