భార్యతో స్నేహితుడి అఫైర్…రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని…

friend affair with wife

తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మహిళ హత్య చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. డెహ్రాడూన్ లో నివాసముంటున్న రూప్ చంద్ ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టడంతో అది చివరికి హత్యగా తేలింది. రూప్‌చంద్ స్థానికంగా ఉన్న పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతని భార్యతో కలిసి కోట్వాలీ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే మృతుడి భార్య రేణుకు అదే ప్రాంతంలో ఉన్న వినీత్ తో కలిసి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రేణు, ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని చూసింది. వినీత్, రేణు బంధం గురించి వాస్తవాలు తెలుసుకున్న రూప్ చంద్ రెడ్ హ్యాండెడ్‌గా కూడా ఇద్దరినీ పట్టుకొన్నాడు. అంతేకాదు రూప్‌చంద్ తన భార్యను మందలించాడు. దీంతో నిందితురాలు రేణు తన భర్తపై మరింత పగ పెంచుకుంది. ప్రియుడు వినీత్‌తో రేణు కలిసి రూప్ చంద్‌ను హత్య చేయాలని ప్రయత్నం చేసింది. ముందుగా రేణు జూన్ 9న మోతాదుకు మించిన నిద్రమాత్రలను భోజనంలో కలిపి రూప్ చంద్ కు తినిపించింది. దీంతో రూప్ చంద్ గాఢనిద్రలో జారుకున్నాడు. అనంతరం రూప్‌చంద్ ను తన ప్రియుడు వినీత్ తో కలిసి ఉరి వేసింది. అలాగే తన భర్త ఉరి వేసుకున్నాడని స్థానికులను పిలిచి రేణు కలరింగ్ ఇచ్చింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని రూప్ చంద్ పోస్టుమార్టం చేయగా ఆత్మ హత్య కాదని హత్య అని తేలింది. దీంతో రేణు ఆమె బాయ్ ఫ్రెండ్ వినీత్ మధ్య కాల్ లిస్టును చూడగా, అసలు విషయం బయట పడింది.