ట్రంప్ టాయిలెట్ పేపర్లకు ఫుల్ డిమాండ్

Full Demand to Trump Toilet Papers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Full Demand to Trump Toilet Papers

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమైపోతోంది. వలసదారులపై మునుపెన్నడూ లేని విధంగా కొరడా ఝుళిపిస్తున్న ట్రంప్.. తన ట్వీట్లతో ఎన్నికల సమయంలో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఏకంగా ట్రంప్ ట్వీట్లన్నీ కలిపి మ్యూజియం కూడా ఏర్పాటుచేశారు. కానీ ఈసారి ట్రంప్ ట్వీట్లు టాయిలెట్ పేపర్ల మీదా హల్చల్ చేస్తున్నాయి.

అమెరికన్లు మాత్రం టాయిలెట్ పేపర్లపై ప్రెసిడెంట్ ట్వీట్లేంటని అభ్యంతరం చెప్పడం లేదు. ట్రంప్ క్రేజ్ పుణ్యమాని టాయిలెట్ పేపర్లు సూపర్ గా అమ్ముడుపోతున్నాయట.. అమెజాన్ విక్రయిస్తున్న టాయిలెట్ పేపర్లు ఇప్పుడు అమెరికన్ పేపర్లో ఫుల్ క్రేజీగా మారిపోయాయి. అందరూ అమెజాన్ టాయిలెట్ పేపర్లే కావాలంటున్నారట.

ఎన్నికల సమయంలోనే టాయిలెట్ పేపర్లపై ట్రంప్ ఫోటోలు ముద్రించగా.. ఒక్కోటి పన్నెండు డాలర్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ట్రంప్ ట్వీట్లున్న టాయిలెట్ పేపర్లు పది డాలర్ల చొప్పున అమ్ముడుపోతున్నాయి. బిజినెస్ మన్ అయిన ట్రంప్.. తన మాటలు, చేతలతో అమెరికాలో వ్యాపారులకు ఫుల్ బిజినెస్ ఇస్తున్నారు.