డిజిటల్‌ ప్రీమియర్ కి అందుబాటులోకి వస్తున్న”గామి “

"Gami" available for digital premiere

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డిఫెరెంట్ స్క్రిప్ట్ లతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల గామి (Gaami) మూవీ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు విశ్వక్. ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగానే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

"Gami" available for digital premiere
“Gami” available for digital premiere

జీ 5 లో ఏప్రిల్ 12, 2024 నుండి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. థియేటర్ల లో మూవీ చూడటం మిస్ అయిన వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విద్యాదర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో చాందిని చౌదరి, అభినయ లు కీలక పాత్రల్లో నటించారు. విశ్వక్ సేన్ తదుపరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ లో కనిపించనున్నారు.