బాబు గోవిందం ఈ కలెక్షన్స్‌ ఏంటీ?

geetha govindam collections

విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి చిత్రంతో యూత్‌లో భారీ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత మహానటిలో చేసిన విజయ్‌ ఆంటోని పాత్ర మరియు తాజాగా ‘గీత గోవిందం’ చిత్రంలో చేసిన గోవిందం పాత్రతో యూత్‌ ఐకాన్‌ అయ్యాడు. విజయ్‌ దేవరకొండకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగి పోయింది. ఆ విషయం గీత గోవిందం కలెక్షన్స్‌ ద్వారా తెలిసి పోతుంది. స్టార్‌ హీరోలకు మాత్రమే సాధ్యం అయ్యే కలెక్షన్స్‌ను గీత గోవిందం చిత్రంతో విజయ్‌ దేవరకొండ రాబడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజుల్లో 10 కోట్ల షేర్‌ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ మొత్తం మొదటి రెండు రోజుల్లో ఏకంగా 25 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.

 geetha govindam collections

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు సైతం అప్పుడప్పుడు ఇంత భారీ స్థాయిలో వసూళ్లు కష్టతరం అవుతాయి. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం సునాయాసంగా రెండు రోజుల్లోనే పాతిక కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసి సంచలనం సృష్టించాడు. మూడవ రోజు అయిన నిన్న కూడా పబ్లిక్‌ హాలీడే అవ్వడంతో కలెక్షన్స్‌ జోరు కొనసాగింది. ఇక నేడు, రేపు వారాంతాలు అవ్వడంతో కలెక్షన్స్‌ వర్షం బీభత్సం కాబోతుంది. ఈ వారాంతం పూర్తి అయ్యే వరకు 50 కోట్ల వరకు కలెక్షన్స్‌ చేరే అవకాశం లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ గీత గోవిందం చిత్రంతో తన స్టార్‌డంను నిరూపించుకున్నాడు. రెండు వారాల పాటు పెద్ద చిత్రాలు లేకపోవడంతో గోవిందం హంగామాకు అడ్డు అదుపు లేకుండా పోనుంది.

geetha govindam