వైరల్ ట్రైలర్

వైరల్ ట్రైలర్

ఓవిద్యార్థినాయకుడి బయోపిక్‌గా వస్తున్న జార్జిరెడ్డి సినిమాట్రైలర్ వైరల్అవుతుంది. విద్యార్థి ఉద్యామాలకు తెరతీసిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. చిన్నవయసులోనే ప్రత్యర్థుల చేతిలో క్యాంపస్లోనే  హతం అయిన జార్జిరెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో ఒక తిరుగులేని తేజం.పి.డి.యస్.యు-అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్యను స్థాపించిన నాయకుడు.

దసరారోజున ఈ ఫర్‌ గాటెన్‌ లీడర్‌ కథను తెరకెక్కిస్తున్న చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేసింది. వన్ మిలియన్ వ్యూస్ ని అందుకుంది. అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపిస్తూ క్వాలిటీ పరంగా, క్వాలిటి పరంగా మంచిటాక్ ని అందుకోబోనునది.వంగవీటిలో ముఖ్య పాత్రలో నటించిన సందీప్ మాధవ్ ఇంకా హీరో సత్య దేవ్ ప్రముఖ మరాఠీ నటి దేవిక లీడ్‌ రోల్ పోషిస్తున్నారు. మైక్‌మూవీస్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రంలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రలో నటించాడు. మంచి సాంకేతిక వర్గం తో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.