వరుణ్ తేజ్10

వరుణ్ తేజ్10

ఐదేళ్ళ కింద ముకుందా సినిమాతో తెరంగ్రేటమ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రానున్న కొత్త సినిమాతో కలిపి పది సినిమాలు చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

సినిమా ఇండస్ట్రీలో హీరోగా వరుణ్ ఈ డిసెంబర్ తో ఐదేళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు.గద్దలకొండ గణేష్ తో మంచి హిట్ కొట్టిన మెగాహీరో పదో సినిమా బాక్సింగ్ నేపథ్యంతో సాగే కథగా రానుంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కిరణ్ పరిచయం కానున్నాడు.

దీని ప్రకారం ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ,తక్కువ టైంలో పది సినిమాలలో హీరోగా నటించి కుర్ర హీరోల్లో అందరి కంటే స్పీడ్ గా సినిమాలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.కొత్త సినిమా ఓపెనింగ్ రోజు “వరుణ్ తేజ్10” అనే టాగ్ చూడగానే అప్పుడే ఈ మెగా కుర్ర హీరో పది సినిమాలు చేశాడా అని షాక్ ఆయారు.తెలుగుసినిమా ఇండస్ట్రిలో సీనియర్ హీరోలు కూడా ఇంతతక్కువ సమయంలో ఇన్ని సినిమాలు చేయలేదు.