మైనరే కదా అని రేప్ చేయబోతే అది కోసేసింది

Shocked Wife In Rape Of The Daughter

మైనారిటీ కూడా తీరని ఒక బాలిక మీద అత్యాచారయత్నం చేసాడొక ప్రబుద్దుడు. భయపెడితే బెదిరిపోయి లొంగిపోతుందని భావించిన ఓ యువకుడు. ఆమె తలపై కత్తిపెట్టి అత్యాచారానికి యత్నించాడు. అయితే అదే కత్తి తీసుకుని, అతని మర్మాంగాన్ని కోసేసింది ఆ బాలిక. వివరాల ప్రకారం హర్యానా రాష్ట్రంలోని ఇంచోలి ఏరియాలో నివాసం ఉంటున్న ఓ 17 ఏళ్ల బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఒంటరిగా గ్రామశివారులో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఆమెను గమనించి, వెనకే రహస్యంగా వెంబడించాడు అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల రాయిస్. పొదల్లోకి వెళ్లిన తర్వాత కత్తితో ఆమెపైకి దూకిన రాయిస్ అరవకుండా నోరు మూసేశాడు. కత్తి తలపై పెట్టి, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అరిస్తే చంపేస్తానని బెదిరించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి యత్నించాడు. ఈ హఠాత్ సంఘటనతో షాక్‌కు గురైన ఆమె జరగబోయే ప్రమాదాన్ని ఊహించి తేరుకుంది. రాయిస్ మర్మాంగాన్ని బయటికి తీసి, అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్న సమయంలో అతని చేతిలో కత్తి లాక్కుంది. బలంగా అతని మర్మాంగంపై ఒక్క వేటు వేసింది. కత్తిపోటు బలంగా తగలడడంతో అతని మర్మాంగం తెగి బడింది. నొప్పి భరించలేక రాయిస్ కేకలు వేశాడు. బాలిక, నిందితుడు ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో సెక్యూరిటీని ఏర్పాటుచేశారు పోలీసులు. కేసు దర్యాప్తులో ఉంది.